మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న మహిళను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయి స్టులు కిరాతకంగా హత్య చేశారని ఎస్పీ బి. రోహిత్ రాజ్ అన్నారు. ఈ ఘటన హేయనీయమని అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పు కొనే మావోయిస్టులు కేవలం దళితురాలు అనే కారణంతో, కనీస మానవతా విలు వల్లేకుండా అంతమొందించడాన్ని ఆయన ఆక్షేపించారు. ‘హైదరాబాద్కు చెందిన బంటి రాధ అలియాస్ నీల్సు (25) 2018లో మావోయిస్టు పార్టీలో చేరింది. డీ.ఎం.ఎలీ చదివిన ఆమె ఏఓబీలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేసింది. కొందరు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆమె మావోయిస్టు పార్టీని వీడా లనుకున్నారు. ఇంతలో ఇన్ఫార్మర్ అనే నెపం మోపి అతి కిరాతకంగా హత్యచే శారు. మృతదేహాన్ని చర్ల మండల పరిధిలోని చెన్నాపురం శివారులో పడేశారు’ అని ఎస్పీ వెల్లడించారు. దళితురాలైన రాధను ఎందుకు హతమార్చారో సమా జానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మావోయిస్టులపై ఉందన్నారు. పార్టీని వీడి లొంగిపోవాలనుకునే ఇతర సభ్యులను వదిలేసి.. దళితురాలినే ఎందుకు హత్యచేశారని ఆయన బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.