అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం 2024-25 విద్యాసంవత్సరానికిగాను విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ లోని అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల ఉపకార వేతనం కోసం జిల్లాలోని అర్హుల నుంచి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా ఉప సంచాలకులు ఎం. నగైలేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, దక్షిణకొరియా, న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాల్లో పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో చదివేందుకు అవకాశముంటుందన్నారు.

అర్హులు www.telangana.epass.cgg.gov.in వెబ్సైట్లో అక్టోబరు 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండి రూ. 5 లక్షలలోపు ఆదాయం కల్గి, గ్రాడ్యుయేషన్లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలని చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది ఉండాలని, ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు.మహారాష్ట్రలో పుణే, థానే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‌–3లో రెండు కొత్త కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Loading

By admin