కారేపల్లి మండలంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వసతి గృహంలో సౌకర్యాలు,ఆహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ అధికారుల బృందం ఉదయం 6 నుంచి తనిఖీలను ప్రారంభించారు.తరగతి గదులు పరిశుభ్రంగా లేవని, గదుల్లో విద్యార్థులకు సరిపడా ఫ్యాన్లు లేవని ఏసీబీ అధికారులు గుర్తించారు.గురుకులంలో నిర్వహణ సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తనిఖీ బృందం గుర్తించడంతో పాటు వివరాలను విలేకరులకు కూడా వెల్లడించారు.ఉన్న ఇబ్బందులను సరి చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందనీ తనిఖీ బృందం చేపట్టిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానని ఏసీబీ డి.ఎస్.పి తెలిపారు.

Loading

By admin

error: Content is protected !!