యువత పొగాకు,దూమపానం దురలవాట్లకు దూరంగా ఉంటే..భవిత ఉజ్వలంగా ఉండే అవకాశం ఉందని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ సూచించారు.రెండు దశాబ్దాలుగా పొగాకు నియంత్రణ కోసం అలుపెరగని కృషి చేస్తున్న రఘునందన్ గురువారం నాడు మహాబూబాబాద్ కు వచ్చారు,ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..దురలవాట్లు ఊబి లాంటివన్నారు. సరదా గా మొదలై జీవితాన్ని ఛిద్రం చేస్తాయని సూచించారు. స్నేహితుల ప్రోద్బలం వల్లనో..లేదా తెలిసీ తెలియకో సిగరెట్,టుబాకో అలవాట్లకు యువత ఆకర్షితమౌతోoదని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారు.

చెడు అలవాట్లకు లోనయ్యే బదులు అదే సమయంలో..ఉన్నత లక్ష్యం దిశగా బుద్ధికి పని చెప్తే..సమాజం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదగడానికి ఎంతో ఆస్కారం ఉందని సూచించారు.యువతకు ప్రతి నిమిషం అమూల్యమైనదేనన్నారు. బాలలు,యువకులు తమ తల్లిదండ్రులకు తెలియకుండా చెడు అలవాట్లకు లోనయ్యే కంటే,గొప్ప ప్రయోజకులై కన్న వాళ్లకు, ఉన్న ఊరుకు పేరు , ప్రఖ్యాతులు తెచ్చి పెట్టవచ్చు అని చెప్పారు. సాధన చేస్తే సాధించలేనిది అంటూ ఏది లేదన్నారు.ఎంతో శక్తి,యుక్తి యువత లో నిబిడీకృతమై ఉన్నాయని,వాటిని చెడు అలవాట్ల తో వక్రమార్గంలో పెట్టే కంటే బుద్ధి, బలం ను వజ్రాయుధంగా మలచుకుని అనుకున్నది సాధించవచ్చని పిలుపు నిచ్చారు.

Loading

By admin

error: Content is protected !!