కొత్తగూడెం 35 వార్డులో ఎన్నో సంవత్సరాలు నిరుఉపయోగంలో ఉన్న కమ్యూనిటీ హాల్ ని వినియోగంలోకి తెచ్చి ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి వినియోగంలోకి తేవాలని డ్వాక్రా మహిళల సమావేశాలు చేసుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా స్థానిక కౌన్సిలర్ బండారి చొరువతో కమిటీ హాల్ చుట్టూ ఆపరిశుభ్రంగా ఎన్నో సంవత్సరాలు నుండి పెరిగిపోయిన చెత్త జెసిబితో శుభ్రపరిచి హాల్లో ఉన్న చిన్న చిన్న మరమ్మతులు చేసి రెండు నూతన ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ లు ఏర్పాటు చేసి మహిళలకు వినియోగానికి తీసుకురావడం జరిగింది.ఈ సందర్భంగా సమైక్య సమావేశంలో రుక్మాంగదర్ బండారి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు.ఇక నుండి ప్రభుత్వ అన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ నుండే నిర్వహించబడతాయని రుక్మాంగదర్ బండారి ఆదేశించారు.సమైక్య సమావేశంలో చేతి వృత్తుల ద్వారా స్వయం ఉపాధి కల్పించే దిశలో త్వరలో స్వయం ఉపాధి అల్లికలు,టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ డిజైనింగ్, వీటికి త్వరలో ఇక్కడి నుంచి శిక్షణ కార్యక్రమం,ఇక్కడే ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాస భారతి మరియు సమైక్య అధ్యక్షురాలు మునిగ సుజాత, ఆర్పి రాజ్యలక్ష్మి మరియు సమైక్య ఓబీలు, సభ్యులు మల్లమ్మ, అరిపినేని లక్ష్మి, రూప బండారి, ఆసియా, రాజేశ్వరి , సృజన,రమణ, రజిత ,కాజా మరియు సమైక్య సభ్యురాలు పాల్గొన్నారు.

Loading

By admin