విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం తేవాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమలు అయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది,అందులో ఎలాంటి సందేహము లేదు,కానీ
🔹3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన, ఇప్పుడు ఉన్న సిబ్బందితో ఒక సింగిల్ టీచర్ తో బొధన. అయితే ఇప్పుడు ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఒకే రూములో మూడు తరగతులు ఏలా బోధన జరుగుతుంది? కొత్త రూముల నిర్మాణం చేపట్తారా?కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టీనట్లైతే, ఇప్పుడు ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు చీకటి గృహాలు అనే విధంగా ఉన్నాయి, ప్రైవేటు/ కార్పొరేట్ పాఠశాలల బిల్డింగులు చూడండి, ప్రభుత్వానివి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో తెలుస్తుంది.
🔹4 వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్స్ స్కూల్ విద్యార్థులకు రవాణా సదుపాయం. అంటే ఇవి మండలాల్లో ఉంటాయా? లేక ప్రతి గ్రామంలో ఉంటుందా? ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందా?

*ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి అవకాశం ఉందా?

  • ప్రస్తుతం తెలంగాణలో 30,023 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.
    యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) డేటా ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 1,320 జీరో టీచర్ స్కూల్స్, 5821 సింగిల్ టీచర్ స్కూల్స్ మరియు 8,886 టూ టీచర్ స్కూల్స్ ఉన్నాయి.
    టీచర్,స్టుడెంట్ రెష్యో: 45.18%.
  • ‌పెండింగ్‌లో ఉన్న ఇన్‌ఫ్రా పనులు…
    1.స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్స్ – 71%
    2.ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్స్ – 18.13%
    3.CwSN మరుగుదొడ్లు – 15.45%
    4.అబ్బాయిల మరుగుదొడ్లు – 9.44%
    5.I&CT – 11.7%
  • 11,124 పాఠశాలల్లో కుళాయి నీటి సరఫరా లేదు,1,859 పాఠశాలల్లో తాగునీరు లేదు. పై డేటాను ఇటీవల రాజ్యసభలో సమర్పించినప్పుడు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు అని స్పష్టంగా కనిపిస్తుంది.మరుగుదొడ్లు ఉన్న పాఠశాలలో కనీసం తలుపు లేక బాలికల అవస్థ. అపరిశుభ్రమైన టాయిలెట్లు, రోగాల భయం తో బాలికలు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలు బహిష్టు ప్రారంభమైన ప్రతిసారీ పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఇళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది.
    బాలికలకు సానిటరీ ప్యాడ్స్ కూడా అందుబాటులో లేవు.బాలికల డ్రాఫౌట్స్ సంఖ్య పెరుగుతుంది.
    చాలా పాఠశాలలు పెచ్చులు పడుతున్నాయి, కప్పు కూలే విధంగా ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి.
    *ఒకే గదిలో.. 2 పాఠశాలలు..10 తరగతుల నిర్వహణ 70 మంది విద్యార్థులతో ఇద్దరు టీచర్స్,
    ముగ్గురు విద్యార్థులు ఒక టీచర్.మరి ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా? లేదా?కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలు మారితే కచ్చితంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల మాఫీయా నుంచి చిన్నారులకు రక్షణ లభిస్తుంది.

అనురాధ రావు
ప్రెసిడెంట్
బాలల హక్కుల సంఘం

Loading

By admin