మణుగూరు ఏరియాలో చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సామాజిక కార్యకర్త కర్నే బాబురావు బుధవారం మణుగూరు ఎక్సైజ్ సీఐ గారికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం మైన్స్ కి వైన్స్ దూరంగా ఉండాలని కానీ అందుకు విరుద్ధంగా పీవీ కాలనీ మల్లారం గేటు నుండి సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వరకు ఇప్పటి ముప్పడిగా బెల్ట్ షాపులు మూడు క్వార్టర్లు ఆరు హాఫ్ లుగా నడుస్తున్నాయని దీంతోపాటు మణుగూరులో అనేక చోట్ల బెల్ట్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఎక్సైజ్ శాఖ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు, రోడ్ల పక్కనే బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో గనులలో కావచ్చు బిటిపిఎస్ కావచ్చు పలు పరిశ్రమలలో విధులకు హాజరయ్యే కార్మికులు లేదా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే కార్మికులు ఎవరైనా వీటికి ఆకర్షితులు అయ్యే అవకాశం ఉందని ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉందని ఆయన అన్నారు, అధిక రేట్లు కూడా వసూలు చేస్తున్నారని వెంటనే ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో బెల్ట్ షాపులు బంద్ చేయించాలని వినతిపత్రంలో కోరినట్లు కర్నే బాబురావు తెలిపారు, ఎక్సెస్ శాఖ స్పందించకపోతే జిల్లా కలెక్టర్ గారికి నేరుగా ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.