▪️ వరంగల్,హన్మకొండ జిల్లాల మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం
▪️ KU పాలక మండలిలో మాలల కు అన్యాయం
▪️ నామినేటెడ్ పోస్టులలో మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి
▪️ పిల్లి సుధాకర్ రాష్ట్ర అధ్యక్షులు మాల మహానాడు

జాతీయ మాల మహానాడు వరంగల్,హనుమకొండ జిల్లాల విస్తృత సమావేశం స్థానిక నందనార్ మాల కల్యాణ వేదికలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశనికి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ….తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి,నేటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషిచేసి, MLA టికెట్ త్యాగం చేసిన సామాజిక ఉద్యమ నేత డాక్టర్ అద్దంకి దయాకర్ కు రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని కోరారు.ఇటీవలే కాకతీయ యూనివర్సిటీ లో ప్రకటించిన పాలక మండలిలో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని,KU లో మాలలను అణిచివేస్తున్నారని అన్నారు, తెలంగాణ ఉద్యమలో క్రియాశీలక భూమిక పోషించిన మాలలకు నామినేటెడ్ పోస్టుల్లో తగుప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు మన్నే బాబురావు,జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేడి అంజయ్య, వెన్న రాజు,మాల సాంస్కృతిక కన్వీనర్ ఎలుక దేవయ్య, రాష్ట్ర కార్యదర్శి సాంబయ్య,జై భీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ అసాది పురుషోత్తం,సిటీ అద్యక్షులు అంకేశ్వరపు రామచందర్,నాయకులు బూడిద నాగరాజు,బొల్లం రాంకుమార్, దావ రవి,సాదు కుమారస్వామి, అంకుస్ రవి,ఉసిళ్ళ ఉదయ్,పొనుగంటి లక్ష్మీ నారాయణ, పెరుమాండ్ల రవి, గార ఉపేందర్, శ్రీనివాస్, దేవేందర్, సంపతి రఘు, అనిత,మాధవి, తదితరులు పాల్గొన్నారు

Loading

By admin