జులై 15 నుంచి 22 వరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా.దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో రానున్న 10 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ కృష్ణా, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మధ్యాహ్నం మరియు సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జులై 15 నుంచి 22 వరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, NLG, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, SRD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.