కాజీపేట రైల్వే జంక్షన్ కు డివిజన్ సాధించడం కోసం అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు తదితరులు అన్నారు. రైల్వే ఐకాస కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్ష తన శనివారం రాత్రి కాజీపేట రైల్వే కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైల్వే కార్మిక సంఘాల నాయకులు పలు సమస్యలను ప్రస్తావించారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. కోచ్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటులో గళమెత్తుతానని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో కాజీపేట కొత్త వంతెనను పూర్తి చేస్తామని చెప్పారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. అయోధ్యపురం వద్ద వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతు లకు నష్ట పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసిందన్నారు. కాజీపేటలో 4, ప్లాట్ఫారాలను అభి వృద్ధి చేయాలని, వందేభారత్తో పాటు అన్ని రైళ్లకు హాల్టు కల్పించాలని దేవులపల్లి రాఘవేందర్ కోరారు. రైల్వేలో ప్రైవేటు రంగం లోనూ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ ఎస్టీ నాయకులు కేఆర్ రాజశేఖర్, ఎక్స్ప్రెస్ రైళ్లకు ఐదు సాధారణ బోగీలు తగిలించాలని పింఛనుదారుల సంఘం నాయకులు గుర్రం సుధాకర్, సంఘమయ్య కోరారు. సంఘ్ సీడబ్లూసీ. సభ్యుడు మురళి, మద్దూర్ యూనియన్ నాయకులు కాలువ శ్రీనివాసు, పి.రవీందర్, లోకో రన్నింగ్ అసోసియేషన్ నేతలు ఏవీఎస్ ఎన్.మూర్తి, సుధీర్, రైల్వే ఐకాస ఛైర్మన్ కొండ్ర నర్సింగరావు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయశ్రీ రజాలీ పాల్గొన్నారు.

Loading

By admin