రేషన్ బియ్యం ను అక్రమంగా తరలించి, రైస్ మిల్లులకు,పౌల్ట్రీకి అమ్ముతున్న వాళ్ళపై పీడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ హెచ్చరించారు.శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మొదలుకుని జులై నెల వరకు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదైన రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల సంఖ్యను గమనిస్తే కొందరు అదే పనిగా రేషన్ బియ్యం “దందా” చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు.కొన్ని రైస్ మిల్లులు రేషన్ బియ్యం కొనడమే దందా గా పెట్టుకున్నoదుకే నెలకు 5,6 కేసులు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదు అవుతున్నాయని అన్నారు.అందుకే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ 2 మార్ల కంటే ఎక్కువ పట్టు బడితే పిడి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం ఖాయం అని రఘునందన్ స్పష్టం చేశారు.జనం రేషన్ బియ్యం తినక పోతే తీసుకోకపోవడం మంచిదని సూచించారు. అంతే తప్ప అలా రేషన్ తీసుకుని, ఇలా..అమ్మేస్తుంటేనే రేషన్ అక్రమ రవాణా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయని అన్నారు. రేషన్ అక్రమ దందా చేస్తే ఆయా డీలర్ల డీలర్ షిప్ రద్దు చేసేందుకు వెనకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు.

Loading

By admin