• సిఐ జితేందర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మర్డర్ కేసు నమోదు చేయాలి
  • కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించండి
  • హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సిఐ జితేందర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్య నేరము కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాల‌ని జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య అన్నారు. సోమవారం భీమదేవరపల్లిలో ఏర్పాటు చేసిన‌ విలేకరుల సమావేశంలో జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య మాట్లాడారు. ఎస్సై కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 5 కోట్ల ఎక్స్ గ్రేషియాతో పాటు పిల్లల చదువులు కూడా ప్రభుత్వమే చదివించాలని విజ్ఞప్తి చేశారు.సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హైకోర్టు జడ్జి తోనే విచారణ జరిపించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు పున‌రావృతం కాకుండా చూడాల‌న్నారు. స‌మావేశంలో జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గం చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, డాక్టర్ ఎద్దులాపురం తిరుపతి, ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాట్ల వెంకటస్వామి,అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెప్యాల ప్రకాష్ ,అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కండె సుధాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల బిక్షపతి,ముప్పు రమేష్ రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin