• పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్నాళ్ళనుండొ దళిత ఉద్యోగులపై అరాచకాలు
  • క్రమశిక్షణ పేరుతో వేదింపులు
  • ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్న ఫలితంలేదు

అంతులేని వివక్షకు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఏడు పోలీసు స్టేషన్లలో ఎస్సైగా పనిచేసిన ఒక ఆఫీసర్ కు, ఇద్దరు పిల్లల తండ్రికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే డిపార్టుమెంటులో కనిపించని వివక్ష ఎంతో ఉంది. దాన్ని ఉన్నతాధికారులు క్రమశిక్షణ పేరుతో దాచిపెడతారు.దళిత అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వరు, ఇచ్చిన చోట ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయి.తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వ రావుపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ జూన్ 30న మహబూబాబాద్ లో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నం చేసుకోగా యశోద ఆసుపత్రిలో రాత్రి 12:30 కు మృతి చెందడం జరిగింది.

ఈ మృతికి కారకులైన అగ్రకుల అహంకారి CI జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ సన్యాసినాయుడు, సుభాని, శేఖర్ శివనాగరాజ్ కారణమని తన భార్య ఫిర్యాదు మేరకు SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలి అని మాల మహానాడు డిమాండ్ చేస్తుంది.కారణం ఏదైనా ఒక అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది తన కన్న తల్లిదండ్రులును కట్టుకున్న భార్యను వదిలి, ఇద్దరు పసిబిడ్డలను తండ్రి లేని వాళ్ళను చేసి,ఎవరిని ఎదిరించే పరిస్థితి లేక ఆత్మహ్యాతే శరణ్యం అనుకొని అన్ని వదిలి వెళ్లిపోయారు.తన కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న భార్యకు వాళ్ళ పిల్లలకు నాయ్యం జరగలి.ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన్నే శ్రీధర్ రావు, మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపాజు రమేష్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాల మహానాడు మహానాడు అధ్యక్షులు తుంపురు శివ తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin