అల్యూమినియం మరియు స్టెయిన్‌లెస్ స్టీల్ వంట సామాగ్రి ISI (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూట్) ముద్రను కలిగి ఉండడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలను కొనసాగించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రకటించింది. ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు వినియోగదారులను రక్షించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో డిపిఐఐటి (మినిస్ట్రీ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) పాత్రలను ఐఎస్‌ఐ గుర్తుతో గుర్తించాలని ఆదేశించింది. ISI స్టాంప్ లేకుండా ఎలాంటి పాత్రలను తయారు చేయడం, దిగుమతి చేయడం, విక్రయించడం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం లేదా ప్రదర్శించడం వంటివి చేయకూడదని BIS ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Loading

By admin