భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం గుర్రాయి గూడెం గ్రామంలో డ్రైనేజ్ పనులు సగంలోనే ఆపివేశారని గ్రామస్తులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే గుర్రాయిగూడెం గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుడు ఎంపీపీ నిధులు, ఎంపీటీసీ ద్వారా విడుదలైన అభివృద్ధి పనులను అడ్డుపడుతూ ఎప్పటినుంచో 2020 నుంచి విడుదలైన నిధులను కూడా అడ్డుపడుతూ తనదైన రాజకీయ మూర్ఖత్వపు కక్ష సాధింపు సాధిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నాడు. గిరిజన నాయకుడి పై కక్ష సాధింపు చర్యతో ఈ డ్రైనేజ్ ను అడ్డుకోవడం గత 2020 సంవత్సరంలో సాంక్షన్ అయిన నిధులను గిరిజన నాయకుడు ద్వారా నిధులు అయినాయని ఆ పనిని గిరిజన నాయకుడు చేస్తే గ్రామాలలో ఉన్న ప్రజల మొత్తం తనవైపు ఉంటారని ఆ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే దాకా కూడా అడ్డుకొని ఇప్పుడు కూడా ఆ గిరిజన నాయకుడు చేస్తున్నాడని అడ్డుకోవడం జరుగుతుంది. అవులూరి రామిరరెడ్డి ఇంటి నుండి బానోత్ బద్య ఇంటి వరకు సుమారు 95 మీటర్ల డ్రైనేజ్ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు వచ్చాయి. కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి మూడు నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు ఈరోజు ఆందోళనకు దిగారు.
గ్రామంలోని డ్రైనేజ్ కు ఆనుకొని ఉన్న తన పొలంలోకి నీరు వస్తుందని డ్రైనేజ్ నిర్మాణాన్ని గోదా నాగేశ్వరరావు అడ్డుకోవడం జరిగింది. గ్రామస్తులు అందరూ కలిసి తన పొలంలోకి నీరు డ్రైనేజ్ లేకపోయినా నీరు పొలంలోకి పోతుంది .గత 30 సంవత్సరాల నుంచి వర్షపు నీరు పొలంలోకి పోవడం జరుగుతుందని ఇప్పుడు డ్రైనేజ్ అడ్డుకోవడం సరికాదని తెలిపారు. డ్రైనేజ్ పనులు మొదలుపెట్టినప్పుడే అధికారులకు తమ సమస్య వివరించి ఉండాలని ఇప్పుడు సగం డ్రైనేజ్ పూర్తి అయిన తర్వాత డ్రైనేజ్ అడ్డుకోవడంలో రాజకీయ పాత్ర ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామంలో కాంగ్రెస్కు భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు గెలిపించడం జరిగింది కాంగ్రెస్కు ఓటేశారు అని కక్షపూరత ధోరణితో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు డ్రైనేజ్ ఆగిపోతుంది, మూర్ఖత్వపు ధోరణితో మాటలు విని అడ్డుకోవటానికి భార్యాభర్తలిద్దరూ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మూడు నెలలు కావస్తున్న ఇంటి ముందు గొయ్యిలు తవ్వు ఉండడంతో మేము చాలా సార్లు గొయ్యిలో పడి ఆసుపత్రి వెళ్ళామని మేము వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ , బండ్లు కానీ ఇంట్లో నుంచి రోడ్డు మీదికి తీయాలన్నా వీలు కావడం లేదని, మాకు త్వరగా డ్రైనేజీ నిర్మించి ఈ సమస్యలను తీర్చాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.