దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పర్యటించి ముందుగా రేషన్ షాప్ ను తనిఖీ చేసి నిల్వలను పరిశీలించి డీలర్ తో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ బియ్యాన్ని అందించాలని తెలియజేసిన అనంతరం గ్రామంలో పర్యటిస్తూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామస్తుల ద్వారా పలు సమస్యలు తెలుసుకున్న సందర్భంగా గ్రామస్తులు ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉందని తెలపటంతో త్వరలోనే డ్రైనేజ్ నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు, అనంతరం అదే గ్రామంలో చేదుకూరి సులేమాన్ గారు హార్ట్ సర్జరీ చేపించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు…ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Loading

By admin

error: Content is protected !!