ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శం…తల్లిదండ్రులు తొలి గురువులు,విద్య అందించే గురువు ప్రాముఖ్యత ఎక్కువ. విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కారణం ఉపాధ్యాయులు. వారి బోధన పద్ధతులు, ఆకట్టుకునే విధంగా చెప్పడం, అర్థం అయ్యేలా చెప్పడం,అర్థం కాలేదు, తెలియదు అని అంటే విడమర్చి చెప్పడం గురువుల బాధ్యత.ఎంత మంది ఈ పద్ధతి పాటిస్తున్నారు.చాలా వరకు ఉపాధ్యాయులు బదిలీ అయితే బాగా పాఠాలు చెప్పే వారు వెళ్ళిపోయేపుడు విద్యార్థులు బాధ పాడుతారు. సూర్యాపేట జిల్లా అప్పర్ ప్రైమరీ స్కూల్ సైదులు తెలుగు టీచర్, సిద్ధిపేట జిల్లా కాల్లకుంటా అప్పర్ ప్రైమరీ స్కూల్ బాలరాజు టీచర్, మెదక్ జిల్లా టీచర్స్ వెళ్లి పోతుంటే విద్యార్థులు బాగా బాధ పడ్డారు.

32 మంది విద్యార్థులు చదువుకుంటున్న మంచిర్యాల జిల్లా పొన్నకల్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస్ ఉపాధ్యాయుడిగా చేరాడు. తను విద్యార్థులపై చూపించే శ్రద్ధ , ఆప్యాయత,ఆట పాటలతో బోధన, అర్థం అయ్యేలా వివరించడం తో 250 కి చేరింది విద్యార్థుల సంఖ్య. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో తనకు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామం అయిన అక్కపెల్లిగూడా 21 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలకు బదిలీ అయ్యింది.అయితే 133మంది విద్యార్థులు తల్లిదండ్రులను ఒప్పించి శ్రీనివాస్ గారు వెళ్లిన పాఠశాలలో చేరారు. అయితే ఆ పాఠశాలలో 154 మంది విద్యార్థుల సంఖ్య అయింది.ఇలాంటి ఉపాధ్యాయులు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉంటే అందరు విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉంటారు.శ్రీనివాస్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దాలని కొరుకుతూ…

అనురాధ రావు
అధ్యక్షురాలు
బాలల హక్కుల సంఘం

Loading

By admin