అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం ఫారెస్ట్ ప్లాంటేషన్లో స్థానిక విద్యార్థులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటిన MLA జారె ఆదినారాయణ గారు అనంతరం విద్యార్థులకు మొక్కలపై అవగాహన కోసం క్విజ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను గుర్తించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం ప్రసంగిస్తూ
మొక్కల పెంపకం వలన స్వచ్ఛమైన గాలి, మనుషులకు కావలసినటువంటి ఆక్సిజన్ లభిస్తుందని, మొక్కల వలన ప్రకృతి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని, అడవుల వలన వర్షాలు సమృద్ధిగా కురవడం తద్వారా పాడిపంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని, అలాగే అడవి జంతువులకు కూడా సరైన ఆహారం దొరికి గ్రామాలలోకి రాకుండా ఉంటాయని అంతరించిపోతున్న అడవులకు దీటుగా మొక్కలు పెంచి భావితరాల వారికి ప్రాణదాతలుగా నిలవాలని పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడాలంటే అడవులు చాలా అవసరమని తెలిపి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి జాగ్రత్తగా సంరక్షించి భావితరాలకు అందించాలని తెలియజేసారు..ఈ కార్యక్రమం లో ఫారెస్ట్ అధికారులు,,మండలం కాంగ్రెస్ నాయకులు,, స్థానిక కాంగ్రెస్ నాయకులు,, వివిధ శాఖల అధికారులు,, తదితరులు పాల్గొన్నారు…

Loading

By admin