మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ BTPS లో యూనిట్‌ -1 వద్ద శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పిడుగుపాటు వల్లనే సంభవించిందని అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ థర్మల్‌ డైరెక్టర్‌ లక్ష్మయ్య, విద్యుత్‌ సౌధా ఎస్‌ఈ రత్నాకర్‌లు ఆదివారం బీటీపీఎస్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం డైరెక్టర్‌ లక్ష్మయ్య విలేకరులతో మాట్లాడుతూ..పిడుగుపాటు ప్రభావం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ పిడుగు పడినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో గుర్తించామని అన్నారు. దీనివల్ల రూ.20 కోట్ల రూ.25 కోట్ల వరకూ నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదం వల్ల యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పత్తికి పూర్తిగా అంతరాయం ఏర్పడుతుందన్నారు. కాలిపోయిన జనరేటర్‌, యంత్ర సామగ్రి లభ్యత ఆధారంగా మాత్రమే ఈ యూనిట్‌ పునరుద్ధరణ అంశంలో స్పష్టత వస్తుందని తెలిపారు.

Loading

By admin