- కేంద్ర మంత్రి, సిఎం దిష్టి బొమ్మలు దగ్ధం
ఎస్సీ వర్గీకరణ మంత్రి మండలి ఆమోదం తెలపడంనీ, అసెంబ్లీలో శమిమ్ అక్తర్ కమిటీ నివేదికను ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలోని మాల సంఘాల జే ఏ సి ఆధ్వర్యంలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ( ఆంసా) రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ గతంలో ఆరు శాతం మాలలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు దానిని 5 శాతానికి తగ్గించడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలాగే మోడీ కనుసన్నల్లో పని చేస్తున్న కాంగ్రెస్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉప వర్గీకరణను చేస్తున్నారని అన్నారు. మాలల భవిష్యత్తును అందకరంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఉపాద్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేసి కాంగ్రెస్ ఓటమి కోసం మాలలు పని చేయాలని కోరారు.
మాల జాతి ద్వారా రాజకీయ చేస్తున్న ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ లో నోరు విప్పక పోవడ్డాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వర్గీకరణకు వ్యతిరేకంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య మాట్లాడుతూ మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకు వచ్చి నిరసన తెలపాలని కోరారు. అనంతం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ మాల (టీమ్) నాయకులు అలుక కిషన్ దేవదాస్ లు మాట్లాడారు. అంతకు ముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. అరగంట పాటు రాస్తారోకో చేసారు