భారత రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ నోటీసుల నేపథ్యంలో నందినగర్‌ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం విచారణకు హాజరైన కేటీఆర్‌, తన న్యాయవాదిని అనుమతించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాట్లాడుతూ, ‘‘హైకోర్టు, చట్టాలపై గౌరవంతో విచారణకు సహకరిస్తున్నా. నా న్యాయవాదిని నాతో రానీయకపోవడం రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకం. ఏసీబీ చెప్పాల్సింది పోలీసులు ఎందుకు చెబుతున్నారు? ఇది రైతు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు నాటకం. కేసులు పెట్టినా భయపడేది లేదు. రేవంత్‌రెడ్డి 420 హామీల అమలుకు పోరాటం కొనసాగుతుంది,’’ అని పేర్కొన్నారు.

కేటీఆర్‌ పోలీసులు, ఏసీబీ తీరుపై విమర్శలు చేస్తూ, విచారణలో పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.

Loading

By admin

error: Content is protected !!