హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి సమస్యలను అరికట్టడంలో పోలీసులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో హోం శాఖ విజయాలను నెక్లెస్ రోడ్ హెచ్ఎండీఏ మైదానంలో సదస్సుగా నిర్వహించారు.

సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక విభాగాలు
పోలీసు శాఖలో సుశిక్షితులైన అధికారులతో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి, న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు వేయించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు.

హోంగార్డుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి
హోంగార్డుల వేతనాలు రోజుకు రూ. 921 నుండి రూ. 1000కి పెంపు, వారపు పరేడ్ అలవెన్స్ రూ. 100 నుండి రూ. 200కి పెంపు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సౌకర్యాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

పోలీస్ స్కూల్‌ల ఏర్పాటు
పోలీసు పిల్లల కోసం 50 ఎకరాల్లో ఉన్నత విద్యా ప్రమాణాలతో పోలీస్ స్కూల్ ప్రారంభిస్తామని తెలిపారు.

ట్రాన్స్‌జెండర్లకు అవకాశాలు
సమాజంలో వివక్ష తగ్గించేందుకు ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా నియమించారు. ఇది వారికి ఆత్మగౌరవంతో బతికే అవకాశం కల్పించిందని సీఎం అన్నారు.

విధి నిర్వహణలో మరణించిన హోంగార్డులకు రూ. 5 లక్షల పరిహారం. పోలీసులు ప్రజల కోసం అహర్నిశలు సేవలందిస్తున్నారని, దీనిపై మరింత దృష్టి పెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, పోలీస్ కమిషనర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Loading

By admin

error: Content is protected !!