సిద్దిపేటలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో SC, ST కమీషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సదర్ మాల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ర్యాకం శ్రీరాములు, వెన్న రాజు, మేడి అంజయ్య, అసాది పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ ఆశయాలు, ప్రజాస్వామ్యానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
వర్ధంతి కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు బుట్టి సత్యనారాయణ, ఎలుక దేవయ్య, బాబు, పురుషోత్తం, కిషోర్, యాదగిరి, ప్రభాకర్, రాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం సమాజంలో సమానత్వం, సంఘటితతపై చైతన్యాన్ని పెంపొందించడంలో కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు
