సింగరేణి యైటింక్లైన్ లైన్ కాలనీ రెస్క్యూ స్టేషన్‌లో జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభం. ఈ పోటీలలో సింగరేణి సంస్థకు చెందిన వివిధ ఏరియాల నుంచి రామగుండం ఏరియా 1, 2, 3, ALP, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు జట్లు పాల్గొననున్నాయి.

ఇవి కార్మికుల సురక్షిత చర్యలు, అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సామర్థ్యాలను పరీక్షించడంలో కీలకంగా ఉంటాయి. రెండురోజుల పాటు జరిగే ఈ పోటీలు సంస్థ లో సురక్షిత వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మద్దతుగా ఉంటాయి.

ఈ కార్యక్రమానికి సింగరేణి సంస్థ CMD బలరాం, ఉన్నతాధికారులు వెంకటేశ్వర రెడ్డి, భూషణ్ ప్రసాద్, ఉమేష్, సావర్కర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. రక్షణా చర్యల పరంగా సింగరేణి సంస్థ చేస్తున్న ప్రగతిని ఎలాగు ఈ పోటీలు ప్రతిబింబిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Loading

By admin

te Telugu
error: Content is protected !!