మీ అబ్బాయి అత్యాచారం కేసులో నిందితుడని.. అతన్ని తప్పించడానికి డబ్బు చెల్లించాలంటూ ఓ మహిళ నుంచి నగదు కొట్టేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి భార్యకు వాట్సాప్‌ వీడియోకాల్‌ వచ్చింది. అందులో పోలీసుల దుస్తుల్లో ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. నలుగురు స్నేహితులు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని..అందులో మీ అబ్బాయి ఉన్నాడని, కేసు నుంచి కాపాడు కోవాలంటే డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. విషయం బాధితురాలు భర్తతో చెప్పింది. ఇంతలో మోసగాడు ఫోన్‌ చేశాడు. అందులో పోలీసు వ్యాన్‌ సైరన్‌ వినిపించి… మీ అబ్బాయిని కోర్టుకు తీసుకెళ్తున్నామని భయపెట్టాడు. దాంతో బాధితురాలు రూ.1.10 లక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలో నేరస్థుడికి పంపించేశారు. ఆ తర్వాత మోసమని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు.

Loading

By admin

te Telugu
error: Content is protected !!