TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి కొత్తగూడెం ఏరియా లోని జి.ఎం ఆఫీస్ నందు రేపు ది.28/04/2025 న జరగబోయే స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ లో ఉద్యోగులకు కావలసిన (పది) ముఖ్యమైన అంశాలను కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు  మెమొరాండం ద్వారా తెలియజేయడం జరిగింది,

1) ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఈ.పి.ఆర్,లో ఏమైన పొరపాట్లు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరడమైనది.

2) కొత్తగూడెం ఏరియాలో మెయిన్ మ్యాగజిన్ వద్ద వాటర్ సరఫరా సరిగ్గా లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వాటర్ ఏర్పాటు చేయాలి.

3) సత్తుపల్లి నుండి కిష్టారం వరకు మరియు రుద్రంపూర్ ఐ.టి.ఐ, నుండి రాంపురం వరకు కలెక్టర్ గారితో గాని, నేషనల్ హైవే అధికారులతో గానీ మాట్లాడి సింగిల్ డివైడర్ ఏర్పాటు చేస్తూ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించాలి,(ఈ మధ్యకా లంలో చాలా యాక్సిడెంట్లు అయ్యి మృత్యువాత పడడం జరిగింది).

4) సి-కేర్ యాప్ వల్ల కార్మికులకు సంబంధించిన లావాదేవీలు విపరీతంగా జాప్యం అవుతు న్నాయి, యాప్ సరిచూసుకొని స్పీడ్ పెంచే విధంగా చూడాలి.

5) ఏరియా వర్క్ షాప్ కార్మికులకు లెదర్ షూ ఇప్పించగలరు, మైన్  క్లాత్ షూ వల్ల ఆయిల్ గ్రీస్ తాకి తొందరగా పాడవుతూ కాళ్లు మంటలు పుడుతున్నాయి.
6)  కార్మికునికి క్వార్టర్ లేకున్నా హౌస్ రెంటు పే-షిట్ లో చూపెడుతున్న గ్రాడ్యూటీకి, నో   హౌస్ వెకేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు.
7) జీ.కే, ఓ.సి.పి, నుండి జే.వి.ఆర్, ఓ.సి.పి, కి డిప్యూటీషన్ మీద పోయిన కార్మికులను వీ.కే,ఓ.సి.పి,కి వాపస్ పంపించగలరు.

8) రుద్రంపూర్ నందు రద్దీ పెరిగినందున రోడ్డు ఇరువైపులా మీటర్ చొప్పున వెడల్పు  చేయించగలరు.

9) ఏరియా వర్క్ షాప్ నుండి సత్తుపల్లి కి బ్రేక్  డౌన్ మీద వెళ్లే కార్మికులకు పూల్  వెహికల్ ఏర్పాటు చేయించగలరు.
10)  ఆర్.సి.హెచ్.పి.లో మ్యాన్ పవర్ మరియు టెక్నీషియన్స్ కొరత ఉన్నందున టెక్నీషియన్ లను ఫుల్ ఫీల్ చేయగలరు, ఖాళీగా ఉన్న ప్రమోషన్ లను అర్హతను బట్టి త్వరగా ఇచ్చే విధంగా చూడాలి.

ఇట్టి విషయాలను రేపు జరగబోయే స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ లో ఉద్యోగులకు సంబంధించిన పది అంశాలను  ఐఎన్టియుసి యూనియన్ ద్వారా యాజమాన్యంతో మాట్లాడడం జరుగుతుంది.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version