కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలోని 7 గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుజాతనగర్, నర్సింహసాగర్, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకులగూడెం పంచాయతీలను ఇందులో చేర్చనున్నారు. ఏజెన్సీ పరంగా సమస్యలు ఉన్నాయా అన్న దానిపై మున్సిపాలిటీ రీజినల్ డైరెక్టర్ మసూద్ ప్రత్యేక పర్యటన నిర్వహించి, ప్రజలతో మాట్లాడారు. ఇది ప్లెయిన్ ఏరియా అనే విషయాన్ని అధికారులు స్పష్టంచేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఫైళ్ల మూటలు చూసి అసహనం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.