భద్రాచలం ఘటన బాధాకరం పంచాయితీ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేయాలి ఈరోజు భద్రాచలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 6 అంతస్తుల బిల్డింగు కుప్పకూలి కొందరు మరణించిన విషయం తెలుసుకొని ఏజెన్సీ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్ తీవ్ర దిగ్బ్రాంతి గురయ్యారు కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం ఎందరినో కలచి వేసింది అని ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం మరియు లోపం వలన జరిగిందని తెలిపారు, ఈరోజు భద్రాచలంలో జరిగిన దుర్ఘటన ఎన్నో జీవితాలు ఎందరో కుటుంబాలు శాశ్వతంగా నష్టపోయాయని నిర్మిస్తున్న భవనంలో చిక్కుకొని మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబాలకు న్యాయం చేసే వాళ్ళు ఎవరంటూ ప్రశ్నించారు కచ్చితంగా ఈ పాపం విద్యావంతులైన ప్రభుత్వ అధికారులదే అని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా అమాయక గిరిజనులు నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ 1/59,1/70 యాక్ట్ బలమైన కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉన్న ఈ చట్టాలను కాపాడుతూ ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు అక్రమ వెంచర్లు అనధికార క్రయవిక్రాయలు నిర్వహించకుండా అడ్డుకోవాల్సిన పంచాయతీ మరియు రెవిన్యూ అధికారులు గత కొంతకాలంగా కార్పొరేట్ వ్యాపారులతో కుమ్మక్కై జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలలో అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేసి కార్పొరేట్ వ్యాపారులకు ఊడిగం చేస్తూ ఎలాంటి అనుమతులు లేకున్నా ఇదేమిటని ప్రశ్నించినటువంటి గిరిజనులను టార్గెట్ చేస్తూ అనేక ఇబ్బందులు గురి చేస్తూ కార్పొరేట్ వ్యాపారులకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ బహుళ అంతస్తులు సెల్లార్ నిర్మాణాలు లిఫ్ట్ నిర్మాణాలు విపరీతమైన లైటింగ్ తోటి అమాయక ప్రజలను దోచుకుంటూ పోతుంటే జిల్లా అధికారులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కార్పొరేట్ వ్యాపారులతో కుమ్మక్కై గిరిజనులను బానిసలుగా మార్చే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుంది అని అన్నారు అదేవిధంగా గిరిజన ప్రాంతంలో తప్పుడు కోర్ట్ ఆర్డర్లు మంజూరు చేస్తూ తప్పుడు అనుమతులు మంజూరు చేస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహిస్తున్నారన్నారు.