గౌరవ సుప్రీంకోర్టు ప్రధానంగా పేర్కొన్న అంశం.. అనుభావిక/Empirical డేటాతో SC సమూహాల
- వెనుకబాటుతనం/Backwardness,
- అన్యాయం/Injustice,
- అసమానత/Inequality,
- తగినంత ప్రాతినిధ్యంలేని/Inadiquate Representetion,
- హేతుబద్ధ విధానం/Rational Principle and Policey ని సరిగా అనుసరించకపోవడం, అవలంభించకపోవడం మరియు ఆచరించక పోవడం.
ఈ తీరును, పద్ధతిని, విధానాన్ని శాస్త్రీయంగా గుర్తించకుండా, హేతుబద్ధంగా తేల్చకుండా, నిర్థారించకుండానే.. అందుకు కారణాలు కనుక్కోకుండానే, తాజా గణాంకాలు అందుబాటులో లేకుండానే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో కులగణన లాంటి పక్రియ చేపట్టకుండానే.. ఎప్పటివో పాత గణాంకాల ఆధారంగా ఏకపక్షంగా, హడావుడిగా.. ఇబ్బడి ముబ్బడిగా వర్గీకరణకు “జై కొట్టడం” రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత మాత్రం తగదు. ఇది కోర్టులలో ఎట్టి పరిస్థితుల్లో నిలవదు. మీరు చేసిన పని మొత్తం.. “బూడిదలో పోసిన పన్నీరు” కావడం ఖాయం. మీరు “”రెంటికీ చెడ్డ రేవడి”” కావడం కూడా తథ్యం. అంతేకాదు.. చరిత్ర హీనులు కావడం ఖాయం. ఇంకా ఇందుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ప్రభుత్వాలు చేసిన అశాస్త్రీయ, అహేతుక, అనాలోచిత మరియు అసంబద్ధ “”వర్గీకరణను”” తిరిగి కోర్టులు కొట్టేయడం కూడా ఖాయం. వీళ్ళ అజ్ఞానం, మూర్ఖత్వం, అసమర్థత, చేతగానితనంతో చేసిన వర్గీకరణ నిందను “”మాలల”” పై వేసేందుకు ఇప్పటి నుంచే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నది కూడా నిజమని, వాస్తవమని ఈ సందర్భంగా యావన్మంది “”మహాజన”” ప్రజానికానికి తెలియజేస్తున్నా.

(సంగటి మనోహర్ మహాజన్)
9849509416