SC వర్గీకరణ, క్రిమీలేయర్ సహా ఇంకా అనేక రాజ్యాంగ హక్కులు కాపాడుకొనుట, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకొనుటకు సంబంధించిన అంశాలతో పాటు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ “”హాలో మాల.. చలో తిరుపతి”” అన్న ఒక సరికొత్త నూతన “”భావోద్వేగ మరియు సున్నిత”” పిలుపులో.. ఈ నెల 23 మార్చి 2025 న ఆదివారం, మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరంలోని స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నందు “రాయలసీమ మాలల JAC”ఆధ్వర్యంలో జరుపతలపెట్టిన రాయలసీమ “మాలల సింహగర్జన/మహాగర్జన””భారీ బహిరంగ సభను పెద్దఎత్తున విజయవంతం చేయమని నిర్వహకులు మనస్పూర్తిగా కోరినదృష్ట్యా.. సామాజిక బాధ్యత నెరవేర్చుటలో భాగంగా.. ఆ మహత్తరమైన, మహోన్నతమైన చారిత్రక కార్యక్రమానికి సంఘీభావంగా, మద్దతుగా.. నేడు కడప నగరంలోని స్థానిక RTC బస్టాండ్ కూడలి సమీపంలోగల Dr.B.R. AMBEDKAR గారి విగ్రంవద్ద.. రాయలసీమ SC, ST మానవ హక్కుల సంక్షేమ వేదిక, అధ్యక్షులు, జక్కం వెంకటరమణ/VenkataRamana JAKKAM (JV) గారు, Dr.B.R. AMBEDKAR Mission కడప, వ్యవస్థాపక అద్యక్షులు, బండి ప్రసాద్/Prasad BANDI గారి సంయుక్త ఆధ్వర్యం మరియు నాయకత్వంలో.. వివిధ “బహుజన, మహాజన” పార్టీల, సామాజిక ప్రజాసంఘాల మరియు పౌర సమాజంతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి మొదట J.V. రమణ గారు.. మహాజన రాజ్యం పార్టీ (MRP) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, సంగటి మనోహర్ మహాజన్ గారు.. బండి ప్రసాద్ గారు సహా RPI పార్టీ, రాష్ట్ర న్యాయ సలహాదారు, ప్రముఖ న్యాయవాది, ఎల్లటూరి రమేష్/Y. RAMESH గారు మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి (CRPC), జాతీయ సమన్వయకర్త, హైకోర్టు న్యాయవాది షేక్ అమీన్ పీరా/Ameen PEERAN SHAIK గార్లు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో RPI రాష్ట్ర కార్యదర్శి, తోట రవికుమార్ గారు.. రాయలసీమ న్యాయ సలహాదారు మరియు న్యాయవాది, తాళ్లపల్లి రమేష్ గారు.. జిల్లా అధ్యక్షులు, ఎట్టి కిరణ్ కుమార్ గారు.. జిల్లా ప్రధాన కార్యదర్శి, దేవరపల్లి సునీల్ కుమార్ గారు.. కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి, గంగనపల్లి నరసింహులు గారు.. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మదనపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు.. అన్నమయ్య జిల్లా బాధ్యులు, చోడవరం సుబ్బనర్సయ్య గారు.. మైదుకూరు బాధ్యులు, తీట్ల చిట్టిబాబు గారితో పాటు Dr.B.R.AMBEDKAR Mission వ్యవస్థాపక యువజననేత, బండి నవీన్ కుమార్ గారు, వ్యవస్థాపక సభ్యులు, బండారి ఓబులేసు, వ్యవస్థాపక సభ్యులు, కొప్పల రామకృష్ణ గారు మరియు ఎర్రదాసరి శేఖర్ గారు.. రాయలసీమ SC, ST మానవ హక్కుల సంక్షేమ వేదిక యువజననేత, జక్కం రాకేష్, తదితరులు పాల్గొనడం జరిగిందని తెలియజేయుటకు ఎంతగానో సంతోషించడమైనదని మరియు అనందించడమైనదని ఈ సందర్భంగా నిజమైన మరియు స్వచ్చమైన భారతీయులు సహా సమాజంలోని అన్నివర్గాల ప్రజలకు తెలియజేయడమైనది.
నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు మరియు బుద్ధవందనాలతో
(సంగటి మనోహర్ మహాజన్)
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,
మహాజన రాజ్యం పార్టీ/Mahajana Rajyam Party (MRP)
కడప, ఆంధ్రప్రదేశ్, ఇండియా – 9849509416.
(J.V. రమణ)
అధ్యక్షులు,
రాయలసీమ SC, ST మానవ హక్కుల సంక్షేమ వేదిక;
కడప , ఆంధ్రప్రదేశ్, ఇండియా – 9440240127.
(బండి ప్రసాద్)
వ్యవస్థాపక అధ్యక్షులు,
Dr.B.R. AMBEDKAR Mission,
కడప, ఆంధ్రప్రదేశ్, ఇండియా -9490660424.