TG: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ చివరి నిర్ణయానికి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఏఐసీసీ పెద్దలు చర్చించారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో జూమ్ సమావేశం నిర్వహించారు.
సీట్ల కేటాయింపు
1️⃣ సీపీఐకి ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశం.
2️⃣ మిగిలిన మూడు సీట్లలో సామాజిక సమీకరణానికి ప్రాధాన్యం.
ఎస్సీ కోటా: అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలనలో.
ఎస్టీ కోటా: శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు చర్చలో.
ఓసీ/బీసీ కోటా: జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇంఛార్జ్ కుమార్ రావు అవకాశంలో.
ఎంపిక ప్రామాణికాలు
గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీ అవకాశం లేదు.
ప్రస్తుతం కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో ఉన్నవారికి అవకాశం లేదు.
కాసేపట్లో మీనాక్షి నటరాజన్ నివేదిక హైకమాండ్‌కు పంపనున్నారు.