ప్రెస్ మీట్ న్యూస్ ప్రతినిది రామగుండం :-మహిళా మాతృమూర్తులు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన గోదావరిఖని 1 టౌన్ అధికారులు. మహిళల యొక్క గొప్పతనం గురించి మహిళలు యొక్క జీవనశైలి వారి యొక్క ఔన్నత్యము వారు చేస్తున్న సేవలు వారి ఆత్మ ధైర్యం సమాజంలో వారికున్న గొప్పతనం గురించి తెలియజేస్తూ వారిని పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కూడా గౌరవించాలి అని వారు డిపార్ట్మెంట్లో ప్రజలకు సేవ చేస్తూ అదే విధంగా కుటుంబాన్ని కూడా నడిపిస్తూ ఎంతో గౌరవంతో ముందుకు పోతున్న పోలీస్ మహిళా మండలి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శనివారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సైలు సోనియా, ఓబులమ్మ కానిస్టేబుల్స్ జ్యోతి, వెంకటలక్ష్మి, ప్రవల్లిక, రచన, కృష్ణవేణి లను చిరు సత్కారంతో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా గోదావరిఖని ఏసిపి మడత రమేష్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, సీఐ 2 రవీందర్ ఎస్సైలు రమేష్, భూమేష్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.