మహిళా దినోత్సవం అనగానే హడావుడి, ఏవో సన్మానాలు,సత్కారాలు చేసి,ఏదో చేశాం అని గొప్పలు, మిగత రోజులు షరా మామూలే,వేధింపులే,ఈసడింపులే,సణుగుళ్లే. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కానీ ఆడవాళ్లకు స్వాతంత్రం వచ్చిందా? ఎక్కడ భద్రత లేదు,కడుపుల ఉన్నప్పుడు అమ్మాయి అని తెలిసిన మరుక్షణం భృణ హత్య, ఎదిగే కొద్ది దినదన గండంలా ఎదుగుదల, ఏ రాబందు ఎక్కడ కాటు వేస్తుందో అనే గుబులు,ఇంటినుండి బయిటికి, బడికి వెళ్లిన అమ్మాయిలు క్షేమంగా వస్తారో లేదో అన్న దిగులు.
ఎంతసేపు అమ్మాయిలకే సుద్దులు, క్రమశిక్షణలో పెట్టాలి అని అంటాం, కాని అబ్బాయిలను కూడా క్రమశిక్షణతో పెంచాలి,మహిళలను గౌరవించడం, సంస్కారం నేర్పించాలి చిన్నప్పటి నుంచి,పెళ్లి అయిన భార్య భర్తలు సమానంగా ఇంటి భాద్యతలు పంచుకోవాలి,ఆడవాళ్ళు అన్న చులకన భావం పోవాలి.
అబ్బాయి అయితే వంశం నిలబెడతారు అనే ఆలోచనను సమాధి చేయాలి. ముందు తల్లి తండ్రుల ఆలోచనలో మార్పు రావాలి, అబ్బాయి అయిన అమ్మాయి అయిన సమానమే అని పెంచాలి.
మహిళలను గౌరవించడం కనీస భాద్యత అని మనవి చేస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభకాంక్షలు..