TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్‌ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్‌ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కల్పించారు.

  • కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా గౌస్‌ ఆలం
  • అదనపు డీజీ (పర్సనల్‌)గా అనిల్‌ కుమార్‌. ఎస్పీఎఫ్‌ డైరెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు
  • సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
  • వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
  • నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
  • రామగుండం సీపీగా అంబర్ కిషోర్
  • ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ
  • భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్
  • మహిళ భద్రతా విభాగం ఎస్పీగా చేతన
  • నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
  • కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
  • సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్
  • రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్
  • వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
  • మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్
  • సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ
  • హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి 
  • ఎస్‌ఐబీ ఎస్పీగా సాయి శేఖర్
  • పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
  • సీఐడీ ఎస్పీగా రవీందర్

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version