TwitterWhatsAppFacebookTelegramShare

తేదీ 01-03-2025 శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ యందు సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్ IRS ను రామగుండం శాసన సభ్యులు శ్రీ రాజ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తో కలిసి సింగరేణి లో ఉన్న అనేక పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరిన INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో వారితో పాటు యూనియన్ జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

సీఎండీ దృష్టి కి తీసుకువచ్చిన ప్రధాన సమస్యలు .

  1. సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంతింటి కల కోసం 250 గజాల భూమి కేటాయింపు మరియు 30 లక్షల వడ్డీ లేని హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) ప్రయోజనం కల్పించాలని .
    1. కోల్ ఇండియా ఉద్యోగుల మరియు సింగరేణి లోని అధికారుల వలె పెర్క్స్ పై కట్టిన ఆదాయపన్ను యాజమాన్యమే చెల్లించాలని.
    2. మారుపేర్ల మార్పు & విజిలెన్స్ సమస్యల ను వెంటనే పరిష్కరించాలని.
  2. RG, SRP, KGM ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి లేదా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా హెల్త్ కార్డులను అందించాలని .
    1. మెడికల్ అటెండెన్స్ రూల్స్‌లో మార్పులు చేయాలని .
  3. అన్ని ఏరియాలలో శిశు సంరక్షణ కేంద్రాలు ( Creche ) ఏర్పాటు చేయాలని.
  4. అన్ని గనుల్లో విశ్రాంతి షెల్టర్లు ఏర్పాటు చేసి, కార్మికుల సామాన్లను భద్రంగా ఉంచుకునేందుకు లాకర్లు కలిగిన అల్మారీలను అందించాలి.
  5. అనేక ఉద్యోగ డీజినషన్లు మార్చాలని సెక్యూరిటీ గార్డ్ → సెక్యూరిటీ కానిస్టేబుల్ , స్టాఫ్ నర్స్ → జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ , ల్యాబ్ టెక్నీషియన్ → జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, చీఫ్ ల్యాబ్ టెక్నీషియన్ , ఫిట్టర్/ఎలక్ట్రీషియన్ → జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్/ఎలక్ట్రీషియన్), సీనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్/ఎలక్ట్రీషియన్), జనరల్ మజ్దూర్ → జనరల్ అసిస్టెంట్, బదిలీ వర్కర్ → జనరల్ అసిస్టెంట్ (ట్రైనీ) (CIL నిబంధనలకు అనుగుణంగా), శాంప్లింగ్ మజ్దూర్ → ల్యాబ్ అసిస్టెంట్ గా మార్చాలని.
  6. వివిధ డిస్జ్నేషన్ల ప్రమోషన్ పాలసీ మరియు క్యాడర్ స్కీం మార్చాలని సర్వే స్టాఫ్, కెమిస్టులు (క్వాలిటీ కంట్రోల్ విభాగం), అటవీ విభాగం ఉద్యోగులు, పారా మెడికల్ స్టాఫ్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్లు (POAs), మెల్టర్స్ (వర్క్ షాప్), క్లర్క్స్ (2019 మార్గదర్శకాల ప్రకారం పదోన్నతులు), S&PC స్టాఫ్‌ కోసం పూర్తి స్థాయి క్యాడర్ స్కీమ్ & పదోన్నతుల విధానాన్ని పునర్నిర్మించాలని .
  7. డిస్మిస్ అయిన ఉద్యోగుల కు కంపెనీ అవసరాల దృష్ట్యా మరో అవకాశం కల్పించాలని.
  8. N-1 విధానం రద్దు చేయాలని.
  9. కార్పొరేట్ మెడికల్ బోర్డు వద్ద మెడికల్ అన్ఫిట్ కానీ ఉద్యోగులకు మరో సారి మెడికల్ బోర్డు కి హాజరయ్యే అవకాశం కల్పించాలని.
  10. సింగరేణి వ్యాపంగా ఉన్న అన్ని ఖాళీలను వెంటనే ఇంటర్నల్ అభర్తులచే భర్తీ చేయాలని కోరారు.
    సింగరేణి సిఎండీ సానుకూలంగా స్పందించారని ఒక ప్రకటనలో తెలిపారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version