భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నావిక్ (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టుల భర్తీకి CGEPT – 2025 (2) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
- నావిక్ (జనరల్ డ్యూటీ): 260 ఖాళీలు
- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 40 ఖాళీలు
అర్హతలు:
- లింగం: పురుష అభ్యర్థులు మాత్రమే
- విద్యార్హత:
- నావిక్ (జనరల్ డ్యూటీ): ఇంటర్మీడియట్ (ఎంపీసీ)
- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 10వ తరగతి
- వయస్సు: 18 నుండి 22 సంవత్సరాల మధ్య (01-09-2003 నుండి 28-08-2007 మధ్య జన్మించినవారు)
- వయస్సులో సడలింపు: OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
ఎంపిక విధానం:
- స్టేజ్ – 1, 2, 3, 4 పరీక్షలు
- వైద్య పరీక్షలు
- సర్టిఫికేట్ పరిశీలన
దరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తు ఫీజు: ₹300 (SC/ST అభ్యర్థులకు ఫీజు లేదు)
- దరఖాస్తు గడువు: 2025 ఫిబ్రవరి 11 నుండి 2025 ఫిబ్రవరి 25 వరకు
ప్రాథమిక వేతనం:
- నెలకు ₹21,700
వివరాలకు మరియు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ : https://joinindiancoastguard.cdac.in/ ను సందర్శించండి:
గమనిక: దరఖాస్తు చేసుకునే ముందు, అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న పూర్తి వివరాలను చదవడం మర్చిపోవద్దు.