TwitterWhatsAppFacebookTelegramShare

ప్రభుత్వ టెలికం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 300 రోజుల వరకు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మొదటి 60 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 120జీబీ డేటా, రోజుకు 100 SMS లభిస్తాయి. అయితే 60 రోజుల తర్వాత డేటా, కాలింగ్ ప్రయోజనాలు ముగుస్తాయి, కానీ సిమ్ మొత్తం 300 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ప్లాన్‌ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 10లోగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, బీఎస్‌ఎన్‌ఎల్ ఓటీటీ ప్లే‌తో కలిసి లాంచ్ చేసిన బీటీవీ ప్లాట్‌ఫామ్ ద్వారా 450కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను అదనపు ఖర్చు లేకుండా చూడొచ్చు. డేటా అవసరం లేకుండానే దేశవ్యాప్తంగా ఈ D2M (Direct-to-Mobile) సేవ అందుబాటులో ఉంది.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version