రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాతినిధ్య అసలు ఉద్దేశాన్ని మరియు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం ఆర్టికల్ – 341(1) చే పార్లమెంటు గుర్తించిన ఉమ్మడి జాబితా యొక్క విస్తృత పరిధి, గుర్తింపు, గౌరవం సహా విలువ, గొప్పతనం, ఔన్నత్యం, ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతతో పాటు సమభావం, సమదృష్టి, దృక్పథం, ఆలోచన ఎలాగూ అర్థం చేసుకోలేరు. కనీసం, మీ అభీష్టం మేరకు వెలువరించిన సుప్రీంకోర్టు యొక్క తీర్పు “స్పూర్తినైనా” గుర్తించేందుకు, గౌరవించేందుకు మరియు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.
కమీషన్ నివేదిక తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించిన అనంతరం.. సదరు నివేదికను శాసన మండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి సోదరుడు మందకృష్ణ స్పందించిన, మాట్లాడిన తీరుపై.. ప్రతిస్పందనగా ఈ పోస్టును పెట్టడం జరిగింది.
ఇతను మందకృష్ణది.. తెలియనితనం, అమాయకత్వం అనాలా.. విడ్డూరం, వితండవాదం అనాలా.. అనాలోచిత, అస్తవ్యస్త, అసంబద్ధ ధోరణి అనాలా.. అనుభవారాహిత్యం, అవగాహనారాహిత్యం అనాలా.. పరిణతిచెందని, పరిపక్వతలేదని అనాలా.. ఇంగిత, సమూహ, సమాజ, లోకఙ్ఞానంలేదని అనాలా.. పరిశీలన, పరిశోధక, శాస్త్రీయ, హేతుబద్ధ ఙ్ఞానంలేదని అనాలా.. చిన్నపిల్లవాడి వ్యక్తిత్వం, మనస్తత్వం అనాలా.. ఇంతకూ ఏమనాలి, ఏమనుకోవాలో? తెలియని, అర్థంకాని పరిస్థితి.
గత సంవత్సరం 01 ఆగస్టు 2024న దేవేంద్ర సింగ్ V/S పంజాబ్ కేసుకు సంబంధించి.. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 7 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6:1 నిష్పత్తిలో వెలువరించిన తప్పనిసరికాని మెజారిటీ తీర్పు, ఆదేశం, అభిప్రాయం మరియు మార్గదర్శకం అనుసరించి.. దేశంలో ఎక్కడెగాని పట్టించుకోని, చెత్తబుట్టలో వేసిన, వేయడానికి 100 శాతం అర్హత, యోగ్యత కలిగిన SC, ST ఉపతరగతి మరియు క్రిమీలేయర్/SC, ST Sub Classification అంశానికి సంబంధించి.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అమలుకు నడుంబిగించి.. బ్లూ ప్రింటు, రోడ్ మ్యాప్, అమలు ప్రణాళిక మరియు విధివిధానాలు సిద్ధం చేసుకొని.. ఇరు రాష్ట్రాలు పోటిబడి ఏకసభ్య కమిషన్లను కూడా నియమించుకొని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, వాటి పనిని ప్రారంభించి.. ఆ మేరకు, మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కమీషన్ నివేదికను ఆగమేఘాలపై మంత్రివర్గ ఉపసంఘానికి, అటునుంచి ముఖ్యమంత్రి గారికి.. అలాగే, రాష్ట్ర మంత్రి మండలిలో సంయుక్త ఆమోదంపొంది.. తదనంతరం సంబంధిత శాసనమండలి మరియు శాసనసభలో ఉభయ సభలలో చర్చచేసి.. చర్చల్లో ఇంకా ఏవైనా మెరుగైన సలహాలు, సూచనలు మరియు అభిప్రాయాలు ఉంటే.. వాటిని కూడా సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలను అనుసరించి, కమీషన్ నివేదికలో ఏవైనా మార్పులు, చేర్పులు చేసి.. సదరు ఉభయ సభల ఆమోదంతో చట్టంగా మార్చి.. సంబంధిత గవర్నర్ల ద్వారా ఆమోదంపొంది “”రాజముద్ర/గెజిట్” రూపంలో అమలుకు ప్రయత్నించడం.
అలాగే రెండో కోణం నుంచి చూచినట్లయితే.. అటునుంచి కేంద్రప్రభుత్వానికి పంపి.. లాకమీషన్, Research Analysis Wing (RAW) సంయుక్త పరిశీలన అనంతరం.. నేరుగా “”తాత్కాలిక కార్యనిర్వహక ఉత్తర్వు కోసం రాష్ట్రపతికి పంపడం లేదా శాశ్వత ఉత్తర్వు”” కోసం న్యాయ మంత్రిత్వశాఖ ద్వారా, పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వశాఖకు చేరుకొని.. పార్లమెంటులో ముసాయిదా బిల్లుపెట్టడం.. సదరుబిల్లు రాజ్యాంగ సూత్రాలకు, నిబంధనలకు అనుగుణంగా ప్రవేశపెట్టి, చర్చచేసి.. అక్కడకూడా ఏవైనా మార్పులు, చేర్పులు చేసి.. ఉభయసభల ఆమోదంతో.. తిరిగి రాష్ట్రపతికి చేరుకొని.. “రాజపత్రం/గెజిట్” రూపంలో అధికారిక ప్రకటన వెలువడడం అన్నది శాసన, కార్యనిర్వహక పక్రియాలో భాగం. అక్కడ నుంచి.. సంబంధిత గవర్నర్ల ద్వారా ప్రభుత్వాలకు చేరుకొని.. సంపూర్ణ మరియు పరిపూర్ణ అమలుకు శ్రీకారం చుట్టడం అన్నది.. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో జరుగుతుంది.
ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్య పక్రియ. సుప్రీంకోర్టు ముందుగానే చెప్పింది.. ఇందులో ఎక్కడైనా “”రాజకీయ దురుద్దేశం, కోణం””ఉంటే.. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా లేకుంటే.. తిరిగి న్యాయ సమీక్షకు/Judicial Review కి రావచ్చని.
ఇప్పుడు మీరు ఆరోపిస్తున్న ప్రకారం మాకు 11 శాతం రావాల్సి ఉంటే.. మాకు కేవలం 9 శాతమే కేటాయించారు.. మాకు “”అన్యాయం చేశారు, కుట్రచేశారు”” అని అంటున్నావు. నిజంగా బుర్ర, బుద్ధి మరియు సోయి ఉన్నోడివే అయితే.. ఈమాట అనే నైతికహక్కు, అర్హత నీకెక్కడిదిబై? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఇలాంటి పరిస్థితులు, గందరగోళాలు, పైరవీలు ఉంటాయనే కదా! మాలాంటివాళ్ళం మొదటినుంచి మొత్తుకుంటున్నది. ఇప్పుడన్నా అర్థమైందా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకూడదో. సరే, అధి అటుంచితే.. ఏ రకంగా 11 శాతం వస్తాయని అనుకుంటావు? ఈ నిష్పత్తి ఎప్పుడు నిచ్చయించింది? అప్పుడెప్పుడు 1950 దశకంలో. ఇప్పుడు పరిగణలోకి తీసుకున్న జనాభా ఏ సంవత్సరంది 2011 ది.
మరి ఏరకంగా 11 శాతం వస్తుంది. సుప్రీంతీర్పులో వర్గీకరణ అనే ప్రసక్తేలేదు. కులాల, ఉపకులాల ప్రసక్తి కూడా లేదు. నిర్ధిష్ట “”అనుభావిక/Eperical”” డేటాను అనుసరించి ముందుకెళ్లమని చెప్పింది. అది ఎవరి ద్వారా అధీకృతం చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే జాతీయ జనగణన నమోదు శాఖ/Registration of National Census Department వారి ద్వారా సేకరించబడే కులగణన లెక్కలే ప్రామాణికం, కొలమానం.
ఇప్పుడు చెప్పండి.. అప్పుడెప్పుడో 1931 లో కుల గణన జరిగింది. ఇంతవరకు కులగణన జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం సేకరించిన “”కుల మరియు ప్రయోజన లెక్కలు””.. ఏవిధంగా అంగీకరించబడతాయి, ఆమోదించబడతాయి?.
ఈ అసంబద్ధ, అశాస్త్రీయ, ఆహేతుక విధానం.. ఏ విధంగా సమర్థనీయం? వ్యక్తుల ప్రాతిపదికన మాట్లాడకూడదు అన్న కనీస ఇంగితజ్ఞానంలేకుండా.. ఘంటా చక్రపాణి, గద్దర్ కుటుంబం, తదితర పేర్లను ప్రస్తావించడం.. ఏపాటి సభ్యత, సంస్కారం? వారు అభివృద్ధి చెందితే.. వారి కుల సమూహాలు మొత్తం అభివృద్ధి చెందినట్లా? ఉదాహరణకు మీరు మందకృష్ణ అభివృద్ధి చెందాడు అనుకోండి.. మందకృష్ణ కుల సమూహాలు మొత్తం అభివృద్ధి చెందినట్లా? అసలు ప్రాతినిధ్య ఫలాలకు, అవకాశాలకు మరియు ప్రయోజనాలకు అర్థం తెలుసా? విద్యా, ఉద్యోగ మరియు రాజకీయ ప్రాతినిధ్య ఫలాలను, ప్రయోజనాలను అభివృద్ధి నమూనాలో భాగంచేయరాదు, చూడరాదు, పరిగణించరాదన్న సోయి, సంగతి తెలుసా?. అంతేకాకుండా.. ఇప్పుడిప్పుడే పాతజ్ఞాపకాలను, గాయాలను మరిచి, రెండుతెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములవలే తిరిగి మసులుకుంటుంటే.. వీల్లమధ్య విభేదాలు, విద్వేషాలు మరియు భావోద్వేగాలు చెలరేగేలా మరియు సృష్టించేలా.. ఖమ్మం జిల్లా భద్రాచలం పరిధిలోని పోలవరం 200 సమీప గ్రామాలు, 7 మండలాలు ఆంధ్రావాల్లు లాక్కున్నారు, గుంజుకున్నారు అని అర్థం వచ్చేలా నిస్సిగ్గుగా అవగాహనలేని, అర్థపర్థంలేని, అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నావు, మాట్లాడుతున్నావు.
చట్టప్రకారం, గౌరవంగా, హుందాగా ఎందుకు తీసుకున్నారో తెలిస్తే?.. ఈమాట మాట్లాడేవాడివికాదు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మునకకుగురై.. తీవ్ర ఇబ్బందులుపడే ప్రమాదం, అవకాశం ఉందన్న కారణంగా.. ఆ గ్రామాలకు, మండలాలకు కూడా.. మిగతా గ్రామాల, మండలాలవలే.. అన్నిరకాల సౌకర్యాలు, పాలనా సదుపాయాలు కల్పించాలన్న భావనతో మంచిఉద్దేశంతో.. ఇరు రాష్ట్రాల పాలకులు తమ విజ్ఞతను, వివేకాన్ని, మానవీయకోణాన్ని మరియు రాజనీతినీ ప్రదర్శించి.. వాటిని ఆంధ్రప్రదేశ్ లో పరస్పర చట్టసమ్మతంతో కలుపుకోవడం జరిగిందన్న విషయం.. మీకు తెలియకపోవడం నిజంగా విడ్డూరం, దురదృష్టకరం.
దీనినిబట్టి చూస్తే.. ఈ సమస్య ఇంకొన్ని సంవత్సరాలు ఉండివుంటే బాగుండు.. ఈ సమస్య పరిష్కరించబడుతుందేనన్న మనోవేదనతో, బాధతో నోటికి ఏదోస్తే, ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమస్య ఏదోరకంగా కొద్దిగా అటోఇటో హుందాగా, గౌరవంగా పరిష్కరించబడిందన్న గొప్ప భావన, ఆలోచన మీలో ఇసుమంతైనా లేకపోవడం.. ఉన్న గుర్తింపు, గౌరవం కోల్పోవడం, పోగొట్టుకోవడమే అవుతుందని తెలియజేస్తూ.. ఉన్న సామూహిక రాజ్యాంగ వనరును.. 3 గ్రూపులుగా వెనుకబాటు, దామాషా నిష్పత్తి లేదా ఇతర ఏదేని ప్రతిపాదికలను పరిగణలోకి తీసుకొని చేశారన్న సంతోషం, ఆనందం మరియు సంతృప్తి మీలో లేకపోతే జీవితానికి ఒక “”అర్థం మరియు పరమార్థం”” లేకుండా.. నిత్యం అసంతృప్తివాదిగా, నిరాశవాదిగా చరిత్రలో మిగిలిపోకతప్పదని.. ఈ సందర్భంగా నిర్మాణాత్మకమైన సూచనచేస్తూ, హితవుపలుకుతూ.. యావన్నంది ప్రజలు, ప్రజాస్వామికవాదులు మరియు జాతి ముద్దుబిడ్డలకు ఉన్న వాస్తవ విషయాన్ని తెలియజేస్తున్నా రండి.. నిన్నటికంటే నేడుమేలు.. ఉన్నదానికంటే ఎంతోకొంతమేలు అన్న చందంగా.. సంతృప్తికర, సంతోషకర మరియు ఆనందకర ఆశావహ దృక్పథ జీవితాలను జీవిద్దాం.. ఇక కోపతాపాలకు, ఈర్షద్వేషాలకు, రాగద్వేషాలకు తావులేకుండా.. అన్నిటికి స్వస్తిపలికి.. ఒక పెద్ద సమూహంలో నుంచి.. చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయినా.. సోదరులంగా కలిసి.. బలమైన రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాతినిధ్య ఉద్దేశాన్ని మరియు పార్లమెంటు గుర్తించిన ఉమ్మడి జాబితా ఆలోచనలను, ఆకాంక్షలను గుర్తించి, గౌరవించి మరియు అర్థం చేసుకొని.. మిగిలిపోయిన బలమైన మరియు ఘనమైన ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు మహోన్నతంగా ప్రయత్నిద్దాం.. ఇక చిన్నదానికి, పెద్దదానికి.. అయినదానికి , కానిదానికి కలహించుకోకుండా, తగవుపడకుండా.. ఇది నల్లా, తెల్లా అని సంకుచితంగా ఆలోచించకుండా, నడుచుకోకుండా, మరియు వ్యవహరించకుండా.. జరిగిందంతా ఒక పీడకలలెక్క ఇరువురు పరస్పరం మరిచిపోయి.. మన భావితరాల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు కలిసికట్టుగా, ఐక్యంగా, సమిష్టిగా మరియు సంఘటితంగా వేద్దామని ఈ సందర్భంగా పిలుపునిద్దాం, విజ్ఞప్తిచేద్దాం మరియు మనవికూడాచేద్దాం….
నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు మరియు బుద్ధవందనాలతో….
(సంగటి మనోహర్ మహాజన్)
వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త,
మహాజన సమన్వయ సమితి/Mahajan Coordination Committee (MCC);
వ్యవస్థాపక జాతీయ కన్వీనర్,
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,
Mahajana Rajyam Party (MRP);
కడప, ఆంధ్రప్రదేశ్, ఇండియా – 9849509416: