TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మధ్య ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి మొదటి అడుగుగా టెండర్లు జారీ చేసింది. ఈ నెల 10 నుండి 24వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. రూ. 33 కోట్ల వ్యయంతో లైడార్ సర్వే చేపట్టనుంది, ఇది 8 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్- చెన్నై కారిడార్:
ఈ మార్గం సుమారు 620 కి.మీ. పొడవుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కర్నూలు, రేణిగుంట, గుంటూరు, వాడి-రాయచూరు మీదుగా చెన్నై వెళ్లే మార్గాలు ఉన్నాయి. కొత్త ప్రతిపాదనలలో హైదరాబాద్-సూర్యాపేట-అమరావతి-తిరుపతి, అలాగే కాజీపేట-విజయవాడ మీదుగా మార్గాన్ని పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్- బెంగళూరు కారిడార్:
570 కి.మీ. పొడవులో నిర్మించనున్న ఈ మార్గం మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, అనంతపురం మీదుగా కొనసాగే అవకాశం ఉంది. గంటకు 350 కి.మీ. గరిష్ట వేగంతో, 320 కి.మీ. సగటు స్పీడ్‌తో రైళ్లు నడుస్తాయి. అంటే కేవలం 2 గంటల్లో బెంగళూరు, చెన్నై చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అమలయితే రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతోపాటు ఆర్థిక ప్రగతికి సహాయపడనుంది.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version