TwitterWhatsAppFacebookTelegramShare

సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి వద్ద ఇటీవల జరిగిన పరువు హత్య కేసు సంచలనంగా మారింది. మామిళ్ల గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సోమవారం మృతదేహం మూసీ కాలువ కట్టపై గుర్తించబడిన అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్పుడు జరిగిన హత్య వెనుక ప్రేమ వివాహం, కులాంతర వివాహం కారణంగా ఉన్న ద్వేషం ఉంది. ఆరు నెలల క్రితం, మాల బంటికి, పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల భార్గవి అనే యువతితో ప్రేమ వివాహం జరిగింది. ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చింది, వీరు సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా సూర్యాపేటలో కలిసి జీవిస్తున్నారు.

కులాంతర వివాహం, యువతి కుటుంబంలో తీవ్ర ద్వేషం కలిగించింది. ఈ సందర్భంలో, యువతి అన్న నవీన్ గౌడ్(నిందితుడు), మృతుడు మాల బంటిని మహేష్ అనే వ్యక్తితో ఫోన్ చేయించి తీసుకెళ్లాడు. అతన్ని గొంతు నులిమి హత్య చేసి, శవంతో పాటు రాత్రి మొత్తం తిరిగి మూసీ కాలువ కట్టపై వదిలేసి పారిపోయారు.

పోలీసులు నిందితుడైన నవీన్ గౌడ్‌ను విచారించినపుడు, అతను నేరం చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. నవీన్ చెప్పిన ప్రకారం, తన నానమ్మ కళ్లల్లో ఆనందం పొందేందుకు ఈ హత్యను చేశానని, మృతదేహాన్ని తన కారులో ఉంచి రాత్రి తిరిగి ఎవరూ ఉండని మూసీ కాలువ కట్టపై వదిలేశాడు.

సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. పోలీసులు ఘటనను ఛేదించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version