2009 విద్యా హక్కు చట్టం ప్రకారం, ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు పేదలకు ఉచితంగా కేటాయించాల్సి ఉన్నా, తెలంగాణలో ఈ నిబంధన ఇప్పటి వరకు అమలు కాలేదు. దీనిపై హైకోర్టు మధ్యస్తం చేయగా, ప్రభుత్వం 2025-26 నుంచి అమలుకు సిద్ధమని హామీ ఇచ్చింది.
ఈ నిబంధన ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతులకి వర్తిస్తుండగా, 1 కిలోమీటర్‌లో ప్రాథమిక పాఠశాల లేదా 3 కిలోమీటర్లలో అప్పర్ ప్రైమరీ పాఠశాల లేనప్పుడు మాత్రమే అమలవుతుంది. తెలంగాణలో 12,126 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నిబంధన అమలుతో ఫీజులను ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఉన్నతవిద్య ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 5,700 కోట్లు బకాయి ఉంది.
సీట్ల కేటాయింపు
అనాథలు, దివ్యాంగులు: 5%
ఎస్టీలు: 4%
ఎస్సీలు: 10%
బీసీ, మైనార్టీలు: 6%
మొత్తం: 25%
ఇతర రాష్ట్రాల్లో స్థితి:
దేశంలోని ఐదారు రాష్ట్రాల్లో తప్ప, మిగతా అన్నింటిలో ఈ నిబంధన అమలు అవుతోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది ఇంకా అమలు కాలేదు. కొందరు ఈ నిబంధనను ప్రతీ ప్రైవేట్ స్కూల్‌లో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.