TwitterWhatsAppFacebookTelegramShare

పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు 2024 సంవత్సరానికి అర్జున అవార్డుకు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి గారు తెలిపారు, ‘‘ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా, అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే మా లక్ష్యం. దీప్తి గారికి 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ గారికి 10 లక్షల నగదు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా, గౌరవంగా 500 గజాల స్థలం కేటాయించడంతో పాటు గ్రూప్-2 స్థాయి ఉద్యోగం కూడా అందజేశాం.’’

ముఖ్యమంత్రి గారు, ‘‘తమ ప్రదర్శనతో తెలంగాణ యువ క్రీడాకారులు మరింత మెరుగు చూపించాలని, రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి కృషిని ప్రోత్సహించేందుకు సహకరించనున్నాయి’’ అని అన్నారు.

అలాగే, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేష్ (చెస్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)లకు కూడా అభినందనలు తెలియజేశారు. 2024లో అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు మరియు కోచ్‌లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version