ఎల్లందు జనరల్ మేనేజర్ (జీఎం) కృష్ణయ్యను కేజీఎం, ఎల్లందు ఏరియా ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్లు ఎండీ రజాక్, వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎల్లందులో కొత్త ఓసీ (ఓపెన్ కాస్ట్) ఏర్పాటు జరుగుతుండగా, దానికి అవసరమైన మానవ వనరులను పీవీకే 5 గనిలో పనిచేస్తున్న కార్మికుల నుండి అందించేందుకు సహకరించాలని జీఎం గారిని అభ్యర్థించారు.
జీఎం కృష్ణయ్య స్పందిస్తూ, కొత్త ఓసీకి అవసరమైన అన్ని అనుమతులు వచ్చిన తర్వాత కార్పొరేట్‌కు లేఖ పంపించి, మ్యాన్ పవర్ కేటాయింపునకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఎల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, సకినాల సమ్మయ్య, బూటుక రాజేశ్వర్ రావు, చిలక రాజయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, జక్కుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.