చౌటుప్పల్: అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రాకెట్‌ను చౌటుప్పల్ పోలీసులు, ఎల్‌బీ నగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌ఓటీ) సంయుక్తంగా ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ముద్దాయిల వివరాలు:
నర్సీపట్నం నివాసి చెల్లూరి నాగవెంకట కృష్ణవేణి, అనకాపల్లి జిల్లా కొత్తకోటకు చెందిన అడ్డూరి ప్రసాద్, పెద్దపేటకు చెందిన కిమిడి ప్రశాంత్ ఈ గంజాయి రవాణా ముఠాలో భాగస్వాములు. వీరిలో కృష్ణవేణి, ప్రసాద్ గతంలో జైలు జీవితం గడిపినట్లు పోలీసులు వెల్లడించారు.
రావణా ప్రణాళిక:
ఈ ముగ్గురూ నర్సీపట్నం నుంచి 14 కిలోల గంజాయిని కిలో రూ. 5,000 చొప్పున కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో కిలో రూ. 12,000కు విక్రయించేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. నర్సీపట్నం నుండి బస్సు ఎక్కిన వారు, తనిఖీల భయంతో చౌటుప్పల్‌లో దిగారు.
పోలీసుల చాకచక్యం:
మంగళవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు చౌటుప్పల్ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగ్‌లో 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 4,01,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న నిందితులు:
హైదరాబాద్‌కు చెందిన త్రిభువన గోపాల్ రేవార్ సహా ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల హెచ్చరిక:
మాదకద్రవ్యాల రవాణా, విక్రయం వంటి అక్రమ చట్రాలు సాగించే వారికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం ప్రెస్ మీట్ న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి