TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి సంస్థను జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్యావరణహిత మైనింగ్ మరియు సోలార్ ఉత్పాదక సంస్థగా గుర్తిస్తూ, విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ప్రతిష్ఠాత్మక ఎనర్షియా అవార్డు బహూకరించారు. ఈ అవార్డును కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ఛైర్మన్ శ్రీ ఘన శ్యామ్ ప్రసాద్ చేతులమీదుగా, సింగరేణి సీఎండీ తరఫున డైరెక్టర్ ఇ అండ్ ఎం శ్రీ డి.సత్యనారాయణ రావు మరియు జీఎం (కోఆర్డినేషన్) శ్రీ ఎస్.డి.ఎం. సుభాని స్వీకరించారు.

శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జీఎం శ్రీ ఎస్.డి.ఎం. సుభాని ఈ అవార్డును సంస్థ ఛైర్మన్ & ఎండి శ్రీ ఎన్.ఎన్. బలరామ్‌కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ బలరామ్ మాట్లాడుతూ, రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్, భారీ జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాట్లు, కార్బన్ డై ఆక్సైడ్ నుంచి మిథనాలు తయారీ, భారీగా మొక్కల పెంపకం వంటి పర్యావరణహిత కార్యక్రమాలకు ఈ అవార్డు గుర్తింపుగా ఉందన్నారు. ఇది సంస్థకు స్ఫూర్తిని కలిగిస్తుందని, భవిష్యత్తులో పర్యావరణహిత మైనింగ్‌తో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి మరింతగా పెంపొందించనున్నట్లు తెలిపారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version