ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలపరచి గెలుపునకు కృషి చేసిన మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ ధోరణిని విడనాడాలని చెన్నయ్య కోరారు. బి జె పి ని బలపరచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గాన్ని విమర్శించే నాయకులను అక్కున చేర్చుకుని మాలలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెన్నయ్య విమర్శించారు. కులగణన లేకుండా ఎంపరికల్ డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసే వర్గీకరణను అడ్డుకుంటామని
కేంద్ర ప్రభుత్వం 341 ఆర్టికల్ సవరణ ద్వారా దేశ మొత్తం అందరికీ సమ న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదని కానీ ముఖ్యమంత్రి గతం లో చంద్రబాబు చేసిన విధంగానే చేయాలని చూస్తున్నారని దీని ద్వారా మాలల కు మాల అనుబంద కులాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని మీ వైఖరి మార కుంటే మీకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాలలు ఉద్యమిస్తారని చెన్నయ్య హెచ్చరించారు. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లో మాల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రాంచందర్ , నల్లాల కనకరాజు,గోపోజు రమేష్, తాలూకా అనిల్ కుమార్ శ్రీమతి నక్క సృజన, శ్రీనివాస్, రమేష్, శ్రీకాంత్ లలిత , సరళ, రమ తదితరులు పాల్గొన్నారు