రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడుగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
కొత్తగూడెం, పాల్వంచ పురపాలక సంస్థలతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతానగర్ మండలాల్లోని 35 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.
విలీనమయ్యే పంచాయతీలు
చుంచుపల్లి మండలం: 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, బాబు క్యాంప్, చుంచుపల్లి (పిటి), ధన్‌బాద్, గౌతంపూర్, ఎన్‌కే.నగర్ (బదావత్ తండా), నంద తండా, పెనుబల్లి, ప్రశాంతినగర్, రామాంజనేయ కాలనీ, రుద్రంపూర్, వెంకటేశ్వర కాలనీ, విద్యానగర్ కాలనీ.
లక్ష్మీదేవిపల్లి మండలం: అశోక్‌నగర్ కాలనీ, చాటకొండ (ఆర్), హమాలీ కాలనీ, లక్ష్మీదేవిపల్లి, లోతువాగు, ప్రశాంత్‌నగర్, సంజయ్‌నగర్, సాతివారిగూడెం, శేషగిరినగర్, శ్రీనగర్ కాలనీ.
పాల్వంచ మండలం: బసవతారక కాలనీ, జగన్నాథపురం, కేశవపురం, లక్ష్మీదేవిపల్లి (ఎస్).
సుజాతానగర్ మండలం: 2 ఇంక్లైన్ (హెడ్‌క్వార్టర్), కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట, నాయకులగూడెం, సుజాతానగర్.
ఈ చర్యల ద్వారా కొత్తగూడెం నగరపాలక సంస్థ పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.