తెలంగాణ గ్రూప్ 2 రెండో రోజు పరీక్షలో రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు లేకపోవడం అభ్యర్థుల్లో ఆందోళనకు దారితీసింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నేతల పేర్లతో ప్రశ్నలు రావడం, సంబంధం లేని అంశాలను ప్రశ్నపత్రంలో చేర్చడంపై అభ్యర్థులు విమర్శలు చేశారు.
“తెలంగాణ చరిత్రకు అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం అవసరం” అని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. బుర్ర వెంకటేశం సార్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, “తెలంగాణ చరిత్రను చేరిపే కుట్ర సాగుతుందా?” అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గ్రూప్ 2 అభ్యర్థులు టిఎస్‌పిఎస్సీ సమీక్ష కోరుతూ, సరైన మార్గదర్శకత్వం కోసం కోరుతున్నారు.