TwitterWhatsAppFacebookTelegramShare

కార్మిక సమస్యలపై యాక్టింగ్ జీఎం బి. రవీందర్ ను కలసిన ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్.కేజీఎం ఏరియా కార్మికులు ఎదురుకుంటున్న ఈ క్రింది సమస్యలను వైస్ ప్రెసిడెంట్ రజాక్ యాక్టింగ్ జీఎం బి. రవీందర్ దృష్టికి తీసుకురావడం జరిగినది.పీవీకే 5 లో ప్రతి రెండు సంవత్సరాలకు ఇచ్చే చలి కోట్లు సరిపడినంత ఏరియా స్టోర్ నుండి పంపించకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులను ఎదురుకున్నారు. ప్రతి రెండు సంవత్సరాకు ఎంత స్టాక్ పంపించాలో అంత స్టాక్ ను పంపించే ఏర్పాటు చేయమని జీఎం ను కోరడం జరిగినది. అదేవిదంగా కోయగూడెం నుండి ఆర్ సి హెచ్ పి కి బొగ్గు లోడింగ్ వచ్చే టిప్పర్లను 5ఇంక్లైన్ రోడ్ నుండి కాకుండా వేరే రూట్ కు డైవర్ట్ చేయడానికి తగిన ఏర్పాటు చేయాలనీ , ఏరియాలో ఉన్న కార్మిక సమస్యలపై యాక్టింగ్ జీఎం తో మాట్లాడటం జరిగింది. అదేవిదంగా కార్మికుడు కారుణ్య నియామకం ద్వారా అన్ఫిట్ అయి కొడుకుకి డిపెండెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కు వెళ్తే 10 th పాస్ సర్టిఫికెట్ తెస్తే ఇంటర్వ్యూ చేస్తామని అధికారులు చెపుతున్నారు. పది చదవని వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఐ ఎన్ టీ యు సి సెక్రటరి జనరల్ జానక్ ప్రసాద్ గారు ఆ సర్ క్యూలర్ ను రద్దు చేయాలనీ సి అండ్ ఎండీ కు మెమోరాండం ఇవ్వడం జరిగినది, అని తెలపడం జరిగింది.

Loading

By admin

Exit mobile version