TwitterWhatsAppFacebookTelegramShare

CM రేవంత్ రెడ్డి వరంగల్‌ ప్రచారంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “2014-19లో కేసీఆర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఇది ఆయన పాలనలో మహిళలపై అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇద్దరు మహిళలకు మంత్రి స్థానం కల్పించి మహిళల సాధికారతకు దారి తీసింది. మేము ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా నిర్ణయాలు తీసుకుంటాం,” అన్నారు.

వరంగల్ అభివృద్ధిపై ఫోకస్
“పదేళ్లలో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయలేకపోయిన కేసీఆర్‌ ప్రభుత్వం, వరంగల్ అభివృద్ధిలో విఫలమైంది. వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తా. ఇప్పటివరకు రూ.6 వేల కోట్లను అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశాం. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి వరంగల్ కేంద్రం అవుతుంది,” అని తెలిపారు.

కొత్త ప్రణాళికలు
రెవంత్‌ మరో ప్రస్తావనగా, తెలంగాణలో 4 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. “పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు,” అని ప్రశంసించారు.

Loading

By admin

Exit mobile version